టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో మేఘ ఆకాష్ కూడా ఒకరు. ఇక 2017లో లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈమె. దాని తర్వాత చల్ మోహన్ రంగా పేట వంటి సినిమాలో హీరోయిన్గా నటించింది.ఇక ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి .అయినా హీరోయిన్గా ఆమెకి మాత్రం సరైన గుర్తింపు రాలేదు. ఇటీవల ఆమె మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర సినిమాలో సైతం నెగిటివ్ పాత్రలో అలరించింది. ఇక ఈ సినిమా తరువాత ఆమె మరొక సినిమాని అనౌన్స్ చేయలేదు.

అయితే తాజాగా ఇప్పుడు ఈమెకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే తాజా సమాచారం ప్రకారం ఈమె త్వరలోనే పెళ్లి పీటలేకపోతోందని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడి కుమారుడితో ఈమె పెళ్లి ఫిక్స్ అయినట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి .ఇక వీరిద్దరిది పెద్దలు కుదిరిచిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని కూడా మేఘ అధికారికంగా ప్రకటించబోతోంది అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ వార్త చెక్కర్లు కొడుతున్నప్పటికీ ఈమె మాత్రం ఇంకా ఈ వార్తలు పై స్పందించలేదు.

ఇటీవల ఏమి భూ అనే సినిమాలో సైతం నటించింది. అంతేకాదు హిందీలో కూడా సల్మాన్ఖాన్ నటించిన రాదే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో మెరిసింది మేఘ. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈమెకి వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ హీరోయిన్గా మాత్రం నిలదొక్కుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఆమె ప్రధాన పాత్రలో నటించిన మనుచిరిత్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలతో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తోంది.ఇక ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. అయితే ఇప్పుడు మరొక యంగ్ హీరోయిన్ కూడా బ్యాచిలర్ లైఫ్ ని ఎండ్ చేస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: