వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నటించిన రెండు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఈ సినిమాల షూటింగ్ సమయం లో వరుణ్, లావణ్యల మధ్య ప్రేమ అయితే మొదలైంది.అయితే ఎంతో సైలెంట్ గానే ప్రేమించుకున్న వరుణ్ లావణ్య నిన్న రాత్రి గ్రాండ్ గా నిశ్చితార్థం జరుపుకుని అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. వరుణ్ లావణ్య నిశ్చితార్థానికి సంబంధించి న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

వరుణ్ గుండె పై లావణ్య త్రిపాఠి చెయ్యి వేసిన ఫోటో అదుర్స్ అనేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం విశేషం.అయితే వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి ఇటలీ లో జరగనుందని సమాచారం అయితే అందుతోంది. ఈ వార్త అభిమానులకు  షాకింగ్ వార్త అనే చెప్పాలి. వరుణ్ లావణ్యల వివాహానికి హాజరు కావాలని ఉన్నా అభిమానులు మాత్రం హాజరు కాలేర ని  కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

వరుణ్ లావణ్య ల పెళ్లి తేదీ కి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ కూడా ఉందని సమాచారం. డెస్టినేషన్ మ్యారేజ్ పై వరుణ్, లావణ్యల కుటుంబాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాల కు దూరంగా అయితే ఉన్నారు. వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో గాందీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నారు.ఆగష్టు నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్ల లో విడుదల కానుంది. వరుణ్ తేజ్ మార్కెట్ ను మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారని అయితే తెలుస్తోంది. ఈ సినిమా సోలో హీరో గా వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ గానే ఉందని తెలుస్తుంది.. వరుణ్ తేజ్ కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: