‘ఆదిపురుష్’ విడుదల తేది దగ్గర పడుతున్న కొద్ది ఆసినిమాలోని విషయాల పై చర్చలు పెరిగిపోతున్నాయి. ఈసినిమాకు సంబంధించి రాఘవుడి లుక్బయట పడింది జానకి లుక్ కూడ బయటకొచ్చింది. ఆఖరికి లక్ష్మణుడు హనుమంతుడి లుక్ కూడ బయటకు వచ్చాయి. అయితే  ఇంతవరకు రావణాసురుడు పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ లుక్ ను మాత్రం ఎందుకు  దాస్తున్నారు అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.


తిరుపతిలో ఈమధ్య జరిగిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సైఫ్ అలీఖాన్ ఎందుకు రాలేదు  అంటూ మరికొందరు మరిన్ని సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు  సంబంధించి ఇప్పటివరకు విడుదల అయిన రెండు ట్రైలర్స్ లో రావణుడి పాత్ర ప్రస్తావన ఉంది. సీత ను అపహరించడానికి మారువేషంలో వచ్చిన రావణుడి లుక్ మాత్రమే కనిపించింది. దీనితో ఈ  మూవీలో రావణుడి ఒరిజినల్ గెటప్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఎందుకు దాస్తున్నారు  అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


మొదట్లో ఈసినిమాకు సంబంధించి విడుదలచేసిన మొట్టమొదటి టీజర్ లో రావణుడు ని  చూపించిన విధానం చాలామందికి నచ్చని విషయం అందరికి తెలిసిందే. ఒక వింత పక్షి పై వికృతమైన గెటప్ లో రావణుడ్ని దర్శకుడు ఓం రౌత్ చూపించాడు ఈ మూవీ టీజర్ లో రావణుడి వాహనాన్ని కూడా తప్పుగ చూపించారు అన్న విమర్శలు వచ్చాయి. రావణుడు  పరమశివుని భక్తుడని అతడి లుక్ ను మార్చవలసిందే అంటూ అనేక హిందూ మత సంస్థలు డిమాండ్ చేసాయి.



అయితే ఆసూచనలకు అనుగుణంగా రావణుడి గెటప్ మార్చార లేదా అన్నక్లారిటీ లేదు.   ప్రస్తుతానికి ఈమూవీ పై ఎన్ని అంచనాలున్నాయో అదేస్థాయిలో వివాదాలు కూడా వస్తున్నాయి. రాముడి మీసాల పై సీత చూడామణి పై హనుమంతుడికి మీసాలు లేకపోవడం పై ఇలా అనేక రకాల వివాదాలు. దీనితో ఈసినిమా విడుదల అయ్యాక ఇంకా ఎన్ని వివాదాలు వస్తాయో అంటూ ప్రభాస్ అభిమానులు ఖంగారు పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: