ఈవారం విడుదల కాబోతున్న రెండు సినిమాలు ప్రేక్షకులలో ఆశక్తిని కలిగిస్తున్నాయి. ‘కార్తికేయ 2’ ఇచ్చిన సక్సస్ ట్రాక్ ను కొనసాగించాలని నిఖిల్ ‘స్పై’ మూవీతో తన ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆప్రయత్నాలను ఏమాత్రం పట్టించుకోకుండా వరస ఫ్లాప్ లలో కొనసాగుతున్న శ్రీవిష్ణు ‘సామాజవరగమన’ ఈవారం మరొక సినిమాగా విడుదల అవుతున్న పరిస్థితులలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఆశక్తికరంగా మారింది.


‘సామాజవరగమన’ ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు ఊహించని సక్సస్ అందుకుంటున్న పరిస్థితులలో ఈ మూవీ ఆ రేంజ్ కి చేరుకుంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి. శ్రీవిష్ణు కాస్త డిఫరెంట్ తన సినిమా కథలు ఎంచుకుంటాడు. అందువల్లనే అతడి సినిమాల పై ఆశక్తి బాగా ఉంటుంది. ఐ లవ్ యు అన్న వారందరికీ హీరో రాఖీ కట్టేయడం అన్న కొత్త పాయింట్ తో ఈ కథను అల్లినట్లు ఈ మూవీ ట్రైలర్ చూసినవారికి అర్థం అవుతుంది.


పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తీసినట్లు అర్థం అవుతోంది. అనేకమంది పేరున్న నటీనటులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇలా అందరికీ సులువుగా కనెక్ట్ అయ్యే విషాయాలను శ్రీవిష్ణు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈమధ్య కాలంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు రాలేదు. దీనితో ఈ సినిమా సక్సస్ అవుతుందా అన్న అంచనాలు వస్తున్నాయి.


మూవీ ట్రైలర్ లో వెన్నెల కిషోర్ సీనియర్ నరేష్కామెడీ అందరికీ నచ్చుతుందని అనిపిస్తోంది. అయితే ఈ మూవీ కథకు ఈ టైటిల్ కు ఎంతవరకు కనెక్షన్ ఉన్నది అన్న విషయం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఒక ఫీల్ గుడ్ సినిమాగా ఈసినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న ‘స్పై’ తో పోటీ పడటం ఒక విధంగా సాహసం. రెబా మోనికా హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి  గోపీసుందర్ సంగీత దర్శకత్వం వహించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: