ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని సినిమాలకు రీ రిలీజ్ లో కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. అందులో భాగంగా నైజాం ఏరియాలో రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ఖుషి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి భూమిక చావ్లా హీరోయిన్ గా నటించగా ... ఎస్ జే సూర్యమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా నైజాం ఏరియాలో 1.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

జల్సా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... ఇలియానా ... పార్వతి మెల్టన్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో 1.26 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

సింహాద్రి : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 1.06 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి రాజమౌళి దర్శకత్వం వహించాడు.

ఒక్కడు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 90 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. భూమికమూవీ లో హీరోయిన్ గా నటించగా ... గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ నగరానికి ఏమైంది : తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 81 లక్షల కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: