ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు అని చెప్పాలి. విభిన్నమైన కమర్షియల్ కథలను ఎంచుకుంటూ సూపర్ హిట్లను సాధిస్తూ ఉంది. అయితే ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఉన్న మిగతా హీరోలతో పోల్చి చూస్తే మహేష్ బాబు వాణిజ్య ప్రకటనల విషయంలో అందరికంటే ముందే ఉన్నాడు అని చెప్పాలి.


 ఎందుకంటే ఇప్పటికే ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ ఉన్నాడు మహేష్ బాబు. ఇక ఏ ఒక్క యాడ్ చేసిన కూడా ఇక సినిమాకు తీసుకునేంత రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. అయితే సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు మాత్రమే కాదు.. ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వని మహేష్ బాబు గారాల పట్టి సితార సైతం తండ్రి సలహాలు లోనే వాణిజ్య ప్రకటనలు చేస్తుంది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే సితార ఇక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.



 ఇక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేసింది. ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార ఇటీవలే ఒక వాణిజ్య  ప్రకటనలో కనిపించింది. ఏకంగా ఒక జువెలరీ యాడ్లో కనిపించింది మహేష్ బాబు కూతురు సితార. అయితే అందమే అసూయపడెలా సితార ఆభరణాల్లో నిజంగానే రాజకుమారిలా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఈ యాడ్ గురించి తెలిసి అభిమానులందరూ కూడా ఆనందంలో ముగిపోయారు. అయితే మొదటి యాడ్ కే సితార తీసుకునే రెమ్యూనరేషన్ గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక్కడ ఈ ప్రకటన కోసం సితార కోటి రూపాయలు అందుకుందట. దీంతో అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: