ఈ భామ తాజా ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ పై కామెంట్స్ చేసింది.. ఈయన పై పొగడ్తల వర్షం కురిపిస్తూ తన క్రష్ అల్లు అర్జునే అంటూ చెప్పుకొచ్చింది. ఈమె మాట్లాడుతూ.. తనకు తెలుగులో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని ఆయన స్టైల్ యూనిక్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ స్టైల్ కు ఎవ్వరైనా కనెక్ట్ అవుతారు అని అందుకే బన్నీ అంటే ఇష్టం అని తెలిపింది.అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియన్ వైడ్ గా ఫాలోయింగ్ తెచ్చుకున్న తర్వాత సెలెబ్రిటీలు కూడా ఈయనకు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ముఖ్యంగా లేడీ సెలెబ్రిటీస్ అయితే చెప్పాల్సిన పని లేదు.. మరి ఐకాన్ స్టార్ ఫాలోవర్స్ లో మరో హీరోయిన్ కూడా చేరిపోయింది అనే చెప్పాలి.. ఇక కింగ్ ఆఫ్ కోత సినిమా తో ఈ భామ కు ఎలాంటి హిట్ దక్కుతుందో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి