మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటలలో ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ తాజాగా కింగ్ ఆఫ్ కోథా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అభిలాష్ జోషి దర్శకత్వం వహించగా ... ఐశ్వర్య లక్ష్మి , రితికా సింగ్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా ఆగస్టు 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజే భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అత్యంత ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగుసినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 80 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 5.5 కోట్ల టార్గెట్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది. ఈ మూవీ కనక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.50 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వచ్చి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: