సూపర్ స్టార్ మహేష్ బాబు , నందమూరి నట సింహం బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జూబ్లీ హిల్స్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు జూబ్లీ హిల్స్ లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలతో ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమా లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైన్ధవ్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా షూటింగ్ ను శ్రీలంక లో వెంకటేష్ పై చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ కి హిట్ సిరీస్ మూవీ లతో దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: