కరోనా టైంలో స్టార్ట్ అమిన ఓటీటీ క్రేజీ ప్రస్తుతం అమాంతంగా పెరిగిపోయింది. సినిమా ధియేటర్స్ లో రిలీజ్ అయినా మరో ప్రత్యేక రోజును చూసి ఓటీటీలో కూడా ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.పెద్ద పెద్ద స్క్రీన్స్ తో కూడిన టీవీలు అందుబాటులోకి రావడం మంచి క్వాలిటీతో కూడిన సౌండ్ సిస్టం లో అందుబాటులో ఉండడంతో జనాలు థియేటర్లో కంటే ఇంట్లో కూర్చొని ఓటీడీలో సినిమా చూడటానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సినిమా ఓటీటీలో చూడడం ఎక్కువైపోతుంది. దీంతో మూవీ మేకర్స్ కూడా భారీ మొత్తానికి ఓటీటీ హక్కులను కొనుగోలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటిటిలో బాగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రేక్షకు ఆదరణతో దూసుకుపోతున్నాయి. 

తాజాగా థియేటర్లో డిజాస్టర్ అయిన గోపీచంద్ మూవీ రామబాణం కూడా ఇదే తరహాలో ఓటీటీలో విడుదలై రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఏకంగా టాప్ 1 ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ఈ సినిమా విడుదలై దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ప్రస్తుతం ఓటీటీ వేదికపై దుమ్మురేపుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు టాప్ వన్ ట్రెండింగ్ పొజిషన్ ఉంది.

ప్రేక్షకులను థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటిలో మాత్రం ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సుమారు రూ.55 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. రొటీన్ స్టోరీ తో ఈ సినిమా రిలీజ్ కావడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఓటీటీ రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు. తాజాగా నాలుగు నెలల తర్వాత నేటిఫ్లిక్స్‌లో ప్రారంభమైంది. ఈ వారం నెట్ఫిక్స్ టాప్ టెన్ మూవీస్ లో రామబాణం మొదటి ప్లేస్ సంపాదించి రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: