
ఇక ఎన్నో ఏళ్ల తర్వాత విక్రమ్ సినిమాతో ఒక సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు ఈ సీనియర్ హీరో. అయితే విక్రమ్ సినిమా సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ జోరు పెంచాడు అని చెప్పాలి. అయితే కేవలం నటుడిగా మాత్రమే కాకుండా అటు నిర్మాతగా కూడా అవతారం ఎత్తి వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు కమల్హాసన్. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ గా శింబు, శివ కార్తికేయన్ తో సినిమాలు మొదలుపెట్టాడు కమల్ హాసన్. ఇక ఇప్పటికే శంకర్ తో ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.
హెచ్ వినోద్ తో తన కెరియర్ లో 23వ సినిమా స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో 234వ సినిమా చేస్తూ ఉన్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు కమల్ హాసన్. అయితే ఇటీవల ఒక అవార్డు ఫంక్షన్ వేడుకకు హాజరైన కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక సినిమా కోసమే గడ్డం పెంచుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సినిమా ఏంటి అన్న విషయాన్ని సస్పెన్స్ లో పెట్టకుండా కమల్ హాసన్ రివిల్ చేశాడు. మణిరత్నం సినిమా కోసమే కమల్ గడ్డం పెంచుకుంటున్నాడట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన నాయకులు సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు రాబోతున్న మూవీపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.