టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. సహజ రెడ్డి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. ఇక తెలుగు ఆడియన్స్ కి సాయి పల్లవి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఫిదా సినిమా తర్వాత తెలుగు స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ ఎక్కువ కాలం గుర్తుండిపోయే పాత్రలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. కొద్ది రోజులుగా ఎటువంటి సినిమాల్లో కనిపించడం లేదు సాయి పల్లవి. డాక్టర్ కోర్స్ కూడా చేసిన ఆమె సమాజ సేవ చేసేందుకు హాస్పిటల్స్ పెట్టబోతోంది

 అంటూ గతంలో రకరకాల వార్తలో వినిపించాయి. అయితే అనూహ్యంగా సాయిపల్లవి ఇప్పుడు పెళ్లి చేసుకుంది అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో మెడలో దండలు వేసుకొని మరొక వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామిని సాయి పల్లవి పెళ్లి చేసుకుంది అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు అని తేలిపోయింది. శివ కార్తికేయన్ తో కలిసి ఆమె నటిస్తున్న SK 21 ముహూర్తం పూజ ఇటీవల నిర్వహించారు మేకర్స్.

 ఆ పూజా కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు రాజకుమార్  సాయి పల్లవి మెడలో వేరువేరుగా పోలదండలను వేసుకుని ఉన్నారు. అయితే ఆ ఫోటోలని కొంతమంది సోషల్ మీడియాలో పెళ్లి చేసుకున్నారు అంటూ వైరల్ చేయడం ప్రారంభించారు. అసలు పెళ్లి ఫోటోలు కాదు అని సినిమా వేడుకల్లో తీసింది అని తాజాగా సాయి పల్లవి తో విరాటపర్వం చేసిన దర్శకుడు వేణు సైతం ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. మరోపక్క సాయి పల్లవి ఈరోజు నాగచైతన్య నటిస్తున్న 23వ సినిమాలో సైతం భాగం అవ్వబోతుంది అని అధికారికంగా వెల్లడించారు. అలా సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ బిజీగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: