నాగ చైతన్య , చందు మండేటి కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి డిసైడ్ అయ్యారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలో సాయి పల్లవి ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే నాగ చైతన్య , సాయి పల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా వీరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

దానితో వీరిద్దరూ కలిసి మరోసారి ఒకే సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే చైతన్య ,  చందు మొండేటి కాంబినేషన్ లో సవ్యసాచి , ప్రేమమ్ అనే రెండు మూవీ లు రూపొందాయి. అందులో సవ్యసాచి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకోగా ... ప్రేమమ్ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే కార్తికేయ 2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చందు మండేటి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ కావడంతో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అందుకు అనుగుణంగా ఈ సినిమాను భారీగా నిర్మించడం కోసం ఇప్పటికే ఈ చిత్ర బృందం 80 కోట్ల బడ్జెట్ ను ఈ మూవీ కి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇలా భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించడానికి గీత ఆర్ట్స్ బ్యానర్ వారు డిసైడ్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: