
అక్కినేని నాగేశ్వర రావు మరియు రామానాయుడు మధ్య ఎంతో కాలం నుండి ఉన్న సాన్నిహిత్యం కారణం గా నాగార్జున కి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేసాడు. కొంతకాలం దాంపత్య జీవితం బాగానే కొనసాగింది కానీ , ఆ తర్వాతే విభేదాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది. వీళ్లిద్దరికీ పుట్టిన బిడ్డే నాగ చైతన్య. అయితే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వెంకటేష్ నాగార్జున మరియు లక్ష్మి ని కలపాలని చాలా వరకు ప్రయత్నం చేసాడట. లక్ష్మి కి కలవాలని ఉన్నా, నాగార్జున కి మాత్రం లేదు.ఎందుకంటే అప్పటికే ఆయన ప్రముఖ హీరోయిన్ అమలతో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ కి కోపం కట్టలు తెంచుకుంది. నాగార్జున తో ఒక రేంజ్ లో గొడవ పడేందుకు వెళ్ళాడు. గొడవపడ్డాడు కూడా, చాలా సంవత్సరాల వరకు వీళ్లిద్దరి మధ్య మాటలు లేవు. వెంకటేష్ ఎదురైతే తల దించుకొని వెళ్లిపోయేవాడు నాగార్జున. అలా చాలా రోజులు జరిగింది , ఆ తర్వాత రీసెంట్ సమయం లో వీళ్లిద్దరు మళ్ళీ స్నేహం గా ఉండడం మొదలు పెట్టారు.