బాలీవుడ్ నటి అమీ జాక్సన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ సినిమా మద్రసపట్నం తో నటిగా వెండితెరకి ఎంట్రీ ఇచ్చింది. సౌత్ ఆడియన్స్ నీ సైతం ఈ సినిమాతో ఆకట్టుకుంది. దాని తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ గా మారింది. అంతేకాకుండా తమిళం తెలుగులో సైతం భారీ సినిమాల్లో నటించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో నటించి మెప్పించింది. తెలుగులో ఆమె చేసిన ఒకే ఒక్క సినిమా ఇది. దాని తర్వాత తమిళంలో రోబో 2.0, ఐ సినిమాల్లో నటించింది. ఇటువంటి భారీ సినిమాలో

నటించిన ఆమె తన అందంతో ఎందరినో ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు తన సినిమాల కోసం అమీ జాక్సన్ తన లుక్ ను మారుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె లేటెస్ట్గా షేర్ చేసిన ఫోటోలని చూసి షాక్ అవుతున్నారు ఆమె అభిమానులు. మరి ఆమె జాక్సన్ అంటే గుర్తుపట్టడం కష్టంగా మారిపోయింది. హెయిర్ స్టైల్ చిన్నగా కంటి బొక్కలు పైకి కనిపించేలాగా మరీ దారుణమైన లుక్కులో కనిపించింది ఈ అందాల తార. ఏమాత్రం అమీ జాక్సన్ లాగా ఈ ఫోటోలో కనిపించడం లేదు. అయినా ఇది నమ్మక తప్పదు. దీంతో అమీ జాక్సన్ ఏమైనా

 వ్యాధితో బాధపడుతుందా లేదా తన నెక్స్ట్ సినిమా కోసం ఇటువంటి లుక్కులోకి మారిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరేమో చాలా దారుణంగా కామెంట్లను చేస్తున్నారు. ఐ సినిమాలో విక్రమ్ మోసం చేసినందుకు చియాన్ పగ తీర్చుకుంటున్నాడు అంటూ చాలామంది చాలా ఫన్నీగా కామెంట్లను పెడుతున్నారు. ఇన్నాళ్ళకి రివెంజ్ తేల్చుకుంటున్నారు మొత్తానికి లేటెస్ట్ లుక్ అస్సలు బాగోలేదు గతంలో చాలా అందంగా కనిపించారు అంటూ ఆమె అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారూ. అలా ప్రస్తుతం ఈ అందాల తార కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: