
ఇదిలా ఉంటే.. తమిళంలో రష్మికకు పెద్దగా క్రేజ్ లేదు. ఎందుకంటే రష్మిక కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం సుల్తాన్ డిజాస్టర్‌గా మిగిలింంది. ఇకపోతే వారియర్స్ చిత్రం ఒకే అనిపించుకున్న అందులో రష్మిక పాత్ర గ్లామర్‌కు, సాంగ్స్‌కు మాత్రమే పరిమితం అయిందనే విమర్శలను ఎదుర్కొన్నారు.దీంతో హిందీ చిత్రం యానిమల్ హిట్ కాకపోతే నటి రష్మిక టాలీవుడ్‌నే నమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలుగులో అల్లు అర్జున్ సరసన నటిస్తోన్న పుష్ప-2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం విడుదల తరువాత తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది. కాగా.. టాలీవుడ్‌లో ప్రస్తుతం పుష్ప-2 తో పాటు రెయిన్ బో అనే లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్ కలిసి నేషనల్ క్రష్‌కు కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.