
ఇప్పటికే రీతూ వర్మ విజయ్ దేవరకొండ, నాని, శర్వానంద్ వంటి స్టార్స్ తో నటించింది. తమిళంలోనూ స్టార్స్ సరసన మెప్పిస్తోంది. తాజాగా 'మార్క్ ఆంటోనీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సక్సెస్ కావడంతో ఎంజాయ్ చేస్తోంది.ఈ క్రమంలో రీతూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన అభిమానులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు నయా లుక్స్ లో మెరుస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
స్లీవ్ లెస్ టాప్, బ్లాక్ ట్రౌజర్ క్యాజువల్ వేర్ లో రీతూ వర్మ సింపుల్ లుక్ తో ఆకట్టుకుంది. షోల్డర్ గ్లామర్ ను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది. అలాగే సిట్టింగ్ ఫోజులతో అట్రాక్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో మెరిసినా తన స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది.తాజాగా పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్,, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. పెద్దగా గ్లామర్ షోకు ఆస్కారం లేకుండా ఇలా తనదైన శైలిలో ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. నెక్ట్స్ ఈ తెలుగు బ్యూటీ 'ధృవ నక్షత్రం'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.