ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండవ పార్ట్ ను వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ విడుదల తేదీన మాత్రం చిత్ర బృందం ప్రకటించలేదు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఆగస్టు 2 వ వారంలో విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక వేల ఈ వార్త కనక నిజం అయితే అల్లు అర్జున్ తో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: