యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇండియా లోనే టాప్ దర్శకులలో ఒకరు అయినటు వంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కనిపించబోతుంది. ఇకపోతే ఈ మూవీ లో జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమరన్ విలన్ పాత్రలలో కనిపించనుండగా రవి బూస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో మొదటి భాగాన్ని కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ చివరి నిమిషానికి వచ్చిన సమయంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయడం లేదు అని ప్రకటించింది. ఇకపోతే ఇన్ని రోజు లపాటు ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయనున్నారు అనే విషయాన్ని మాత్రం ఈ మూవీ మేకర్స్ ప్రకటించలేదు. దానితో ఈ మూవీ విడుదలకు సంబంధించి రోజుకో వార్త పుట్టుకొచ్చింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ నిర్మాత ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ నిర్మాత ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ పై ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి. దానితో ఈ మూవీ కి ఇప్పటికే భారీ మొత్తంలో ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: