స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని అగ్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఓయ్ పొగరు హీరోలతో సినిమాలు చేస్తూనే మధ్యలో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా నిర్మిస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ క్రమంలోనే తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో 'మ్యాడ్' అనే సినిమా తెరకెక్కింది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత రాధాకృష్ణ కుమార్తె హారిక ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు.

 సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో ఫార్చునర్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాని సెప్టెంబర్ 28న థియేటర్స్ లో విడుదల చేయాలని నిర్వహించుకుని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఎందుకో తెలియదు ఆ తేదీన కాకుండా అక్టోబర్ 6న 'మ్యాడ్' సినిమాని విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 6 న ఈ క్రేజీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. 

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ఈ సినిమాలో ఓ హీరోగా నటిస్తుడటంతో ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా దక్కుతోంది. యువతను విశేషంగా ఆకట్టుకొని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర నిర్మాతలు సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. దినేష్ కృష్ణన్ బి, షామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రఘుబాబు, మురళీధర్ గౌడ్, రచ్చ రవి, విష్ణు, ఆంథోనీ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: