ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

అలాగే ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు ఇప్పటికే నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో అల్లు అర్జున్ పోర్షన్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను జనవరి వరకే పూర్తి చేయాలి అని ఈ మూవీ బృందం వారు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికల్లో భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: