టాలీవుడ్  టాప్ ప్రొడ్యూసర్స్ గా మైత్రీ మూవీ మేకర్స్ పేరు పొందారు.. అగ్ర నిర్మాణ సంస్థ ల్లో ఒకటిగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు.మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా తో వారి సినీ ప్రయాణం మొదలు అయింది. అప్పటి నుండి వరుసగా స్టార్ హీరోల తో భారీ సినిమాలు నిర్మించి వరుస సక్సెస్ లను అందుకుంటున్నారు.టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువ వున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్..ఎంతో మంది దర్శకులకు లైఫ్ ఇచ్చిన ఈ నిర్మాణ సంస్థ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఏకంగా సల్మాన్ ఖాన్ తో కలిసి. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్థ కలిసి బాలీవుడ్ లో 'ఫర్రి' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది . థాయిలాండ్ కి చెందిన బ్యాడ్ జీనియస్ అనే సినిమా కు రీమేక్ గా తెరకెక్కుతున్నట్టు సమాచారం.ఇక రీసెంట్ గా ఫర్రి ట్రైలర్ కూడా రిలిజ్ చేశారు మూవీ టీమ్..

కొంతమంది స్మార్ట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ లో ఎలా కాపీ కొడతారు, అలాంటి వాళ్ళని ఎలా పట్టుకున్నారు, వాళ్ళ లైఫ్ ఏమైంది అనేది ఈ సినిమా కథ.ఆసక్తికర స్టోరీతో యూత్ ను అట్రాక్ట్ చేసేలా ఈమూవీ తెరకెక్కుతోంది. ఇక  ఫర్రీ సినిమా ను నవంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ సినిమా కి సల్మాన్ ఖాన్ కేవలం నిర్మాత గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు ఈ మూవీ లో సల్మాన్ గెస్ట్ రోల్ కూడా చేసినట్టు సమాచారం. సల్మాన్ తో కలిసి ఓ సినిమాని బాలీవుడ్ లో మైత్రి మేకర్స్ నిర్మిస్తుండటంతో.. మైత్రీ వారు బాలీవుడ్ లో కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: