టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ఓ భారీ బడ్జెట్ మూవీ మొదలు కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ 80 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ మోస్ట్ క్రెజియెస్ట్ బ్యూటీ సాయి పల్లవి , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించబోతోంది.

ఇప్పటికే ఈ మూవీ బృందం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 23 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడుగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే విషయంకు సంబంధించి చిత్ర బృందం ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

మూవీ బృందం ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ ని కాకుండా సంతోష్ నారాయనన్  మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫామ్ చేసుకున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సంగీత దర్శకుడు నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా అనే తెలుగు మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: