టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జెటిక్ స్టార్ రామ్ నటించిన స్కంద సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చుతుందని చెప్పుకుంటున్నారు.ఎప్పటిలానే కథ కథనాల మీద కన్నా కూడా బోయపాటి కేవలం నరుకుడు మీదే దృష్టి పెట్టాడు. రామ్ లాంటి హీరోతో ఇలాంటి ఫుల్ లెంగ్త్ మాస్ మూవీ చేస్తున్నాడు కాబట్టి యాక్షన్ ఓ రేంజ్ లో పెంచేసాడు.అందుకే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. రామ్ ఎనర్జీని బోయపాటి ఈ విధంగా యాక్షన్ సీన్స్ కే వాడేసుకున్నాడు. అయితే రామ్ కన్నా థమన్ ని ఒక రేంజ్ లో వాడుకున్నాడు. థమన్ ఇచ్చిన మ్యూజిక్ గోలకి థియేటర్లలో స్పీకర్స్ పగిలిపోతున్నాయంటూ కంప్లైంట్ వచ్చింది. గుంటూరు నుంచి GS అనే థియేటర్ యజమానులు మూవీ టీంకి డెసిబుల్స్ తగ్గించమని కంప్లైంట్ చేశారట. అలాగే ఆడియన్స్ కి కూడా చాలా గోలగా ఉందని మ్యూజిక్ డెసిబుల్స్ తగ్గించమని ఆ థియేటర్ యాజమాన్యంని కోరినట్టు సమాచారం తెలుస్తుంది.


అయితే సినిమా ఎలా ఉన్నా బోయపాటి కొన్ని అంశాలు కచ్చితంగా ఫాలో అవుతాడు. వాటిలో ఆయన పంచు డైలాగులు కూడా ఖచ్చితంగా ఒకటి. రామ్ స్కంద సినిమాలో ఛాన్స్ దొరికితే చాలు పంచులు పేల్చాడు బోయపాటి శ్రీను. ఏకంగా ఆంధ్రా, తెలంగాణా సీఎం ల నేపథ్యంతో కథను చెప్పిన బోయపాటి కొన్ని డైలాగ్స్ విసిరాడు.సినిమా టాక్ ప్రస్తుతానికి యావరేజ్ గా ఉన్నా నెక్స్ట్ వీక్ మండే వరకు అసలు సినిమా లెక్క ఏంటన్నది తేలుతుంది. రామ్ స్కంద సినిమాకు ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు. అయితే అఖండ సినిమా రేంజ్ మ్యూజిక్ అందించడంలో ఫెయిల్ అయ్యాడు థమన్. ఒట్టి గోల తప్ప ఏమి లేదు. హీరోయిన్ శ్రీ లీలని కూడా సరిగా వాడుకోలేకపోయారు. ఇక రామ్ స్కంద ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది ఈ వీక్ తరువాత చూడాలి. శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజైంది.అయితే సినిమా తెలుగులోనే ఇలాంటి టాక్ తెచ్చుకోగా మిగతా భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: