'సలార్' సినిమా వాయిదా పడి క్రిస్మస్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో మళ్లీ కొత్త టెన్షన్ మొదలైంది.ఈ మూవీ ఈ  డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. దీంతో మళ్లీ కొంతమంది మేకర్స్కు కొత్త టెన్షన్ మొదలైనట్టే.ఇప్పటికే పలు చిత్రాలు క్రిస్మస్ సీజన్ను  ఖరారు చేసుకున్నాయి. వీటిలో బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ 'డంకీ' సినిమా కూడా ఒకటి.అందుకే 'సలార్' కొత్త విడుదల తేదీ ప్రకటించగానే అందరీ దృష్టి కూడా 'సలార్ వర్సెస్ డంకీ'పైనే పడింది. ఎందుకంటే 'డంకీ' సినిమా విడుదల తేదిని ఎప్పుడో అనౌన్స్ చేశారు ఆ మూవీ మేకర్స్. పైగా 'పఠాన్', 'జవాన్'తో బ్యాక్ టు బ్యాక్ రూ.1000కోట్ల బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుక్.. 'డంకీ' సినిమాతో ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొడతారని అంతా గట్టిగా నమ్ముతున్నారు.


అయితే భారీ ఓపెనింగ్స్ సాధించే హీరోల సినిమాలు ఒకే రోజు రావడం మాత్రం మంచిది కాదన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే అవి వసూళ్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి షారుక్ ఖాన్ 'డంకీ'ని ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేసి ప్రభాస్తో పోటీ పడతారా లేదంటే వాయిదా వేసుకుంటారో అని అనుకున్నారు కానీ.. అసలు మూవీ మేకర్స్ తగ్గట్లేదు.అయితే ఈ 'సలార్' కొత్త రిలీజ్ డేట్ వార్త.. ఇక డిసెంబర్ మంత్ లో రణబీర్ కపూర్ యానిమల్ సినిమా కూడా విడుదల అవుతుంది. ఇది కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ. అయితే ఈ మూవీ వాటికంటే ముందే వచ్చేస్తుంది.డిసెంబర్ 1 న వస్తుంది. ఇక అలాగే నాని హాయ్ నాన్న డిసెంబర్ 7 న, విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 9 న, అలాగే ధనుష్ కెప్టెన్ మిల్లర్ 15 న ఇంకా వెంకటేష్ సైందవ్ డిసెంబర్ 22 న విడుదల అవుతున్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: