టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు అని అంటున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుండి వస్తున్న అవుట్ అండ్ అవుట్ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైన్ 'టైగర్ 3'(Tiger 3). మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్నారు. YRF స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ ఉండబోతోంది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. 

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో తెగ హడావిడి చేస్తోంది. అదేంటంటే 'టైగర్ 3' మూవీలో తారక్ ఎంట్రీ కూడా ఉండబోతున్నట్లు బాలీవుడ్లో ఓ వార్త ఊపందుకుంది. ఈ మూవీ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు మూవీలో ఎన్టీఆర్ ఎంట్రీ కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ లో మార్వెల్ సిరీస్ కు ఎంత క్రేజ్ ఉందో, బాలీవుడ్ లో యశ్ రాజ్ స్పై యూనివర్స్ కి అంతే క్రేజ్ ఉంది. ఈ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మరో మూవీ 'వార్ 2'. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ మూవీ 2025లో విడుదల కాబోతోంది. 

'వార్ 2' ద్వారా యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో అడుగుపెడుతున్న ఎన్టీఆర్, ఈ సినిమా కంటే ముందుగానే రా ఏజెంట్ గా 'టైగర్ 3' లో పరిచయం కాబోతున్నారని లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది స్పై యూనివర్స్ లో భాగంగా షారుక్ నటించిన 'పఠాన్' లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఎలా ఉంటుందో, ఇప్పుడు 'టైగర్ 3' లోను తారక్ ఎంట్రీ అదేవిధంగా ఉంటుందని చెబుతున్నారు. 'టైగర్ 3' క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చే ఎన్టీఆర్ పాత్ర మళ్లీ 'వార్ 2' లో ఎంట్రీ ఇస్తుందట. ఇదే విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఫిలిం అనలిస్ట్ విశ్వజిత్ పాటిల్ సైతం సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే దీనిపై యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: