శివ కార్తికేయన్ తాజాగా మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు మాడోనే అశ్విన్ దర్శకత్వం వహించగా ... భరత్ శంకర్మూవీ కి సంగీతం అందించాడు. రెడ్ గ్లంట్ మూవీస్ సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో అదితి శంకర్ , శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది.

 ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా అందుబాటు లోకి వచ్చింది. ఇకపోతే ఈ సినిమా కి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి కూడా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని అక్టోబర్ 8 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు జెమినీ ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.  మరి ఇప్పటికే థియేటర్ ,  "ఓ టి టి" ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk