తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా రూపొందిన స్కంద సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ను అందుకునే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరంలో ఈ నెలతో కలిపితే మరో రెండు నెలలు ఉన్నాయి. ఈ నెల మరియు వచ్చే రెండు నెలల్లో కూడా శ్రీ లీల కు సంబంధించిన సినిమాలు విడుదల కాబోతున్నాయి ఆ సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

ఇకపోతే ఇప్పటికే పోయిన నెల సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల అయినా స్కంద మూవీ తో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ఈనెల విడుదల కావడానికి రెడీగా ఉన్నా భగవంత్ కేసరి సినిమాలో కూడా నటించింది. బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో ఈ నటి బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. ఈ మూవీ తర్వాత నవంబర్ నెలలో ఈ ముద్దుగుమ్మ నటించిన ఆది కేశవ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ఇకపోతే ఈ మూవీ తర్వాత డిసెంబర్ నెలలో ఈ నటి నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ లో నితిన్ హీరోగా నటించగా ... వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇలా ఈ సంవత్సరంలో శ్రీ లీల నటించిన నెలకు సినిమా విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: