క్షిణాది లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్న నయనతార విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న తరువాత కూడ ఇండస్ట్రీలో ఆమె నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది. ఈమధ్యనే తన కవల పిల్లల పుట్టినరోజును వేడుకగా సెలిబ్రెట్ చేసుకున్న నయన్ లేటెస్ట్ గా నటిస్తున్న ఒక సినిమా చాలమంది దృష్టిని ఆకర్షిస్తోంది.



మూవీ పేరు ‘అన్నపూర్ణి’ తిండిదేవత అన్న ట్యాగ్ లైన్ ఇచ్చారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార పూర్తి శాఖాహారి కావడంతో నాన్ వెజిటేరియన్ తినాలనే తన కోరిక తీరే అవకాశం లేకపోవడంతో తన ఇంజనీరింగ్ పుస్తకాలలో చికెన్ బొమ్మలు పెట్టుకుని వాటి వైపు ఆత్రంగా చూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చూసిన వారికి ఈ మూవీలో ఏదో డిఫరెంట్ కథ ఉంటుంది అన్న అంచనాలకు వస్తున్నారు.



గతంలో ‘అదుర్స్’ సినిమాలో బ్రాహ్మణ యువతగా నయనతార నటించి మెప్పించిన విషయం తెలిసిందే. నాన్ వెజ్ మాట వింటేనే మండిపోయే కుటుంబ నేపధ్యంలో పుట్టిన నయనతార కు శాఖాహార వంటలు అంటే నచ్చవట. దీనితో నయనతార తన నాన్ విజిటేరియన్ కోరిక ఎలా తీర్చుకుంది అన్న పాయింట్ చుట్టూ అల్లబడిన ఈ మూవీలో ప్రత్యేకంగా హీరో ఉండడు అని అంటున్నారు.



‘జర్నీ’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన జైని ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు అయితే అతడు హీరో కాదు.  తెలుగు తమిళ కన్నడ మళయాళ భాషలతో పాటు హిందీని త్వరలో విడిదల చేయబోతున్నారు. నయన్ నటించిన ‘జైలర్’ మూవీ 1000 కోట్ల మూవీగా బాలీవుడ్ షేక్ చేసిన పరిస్తుతుల్లో నయన్ కు బాలీవుడ్ ప్రముఖ సంస్థల నుండి ఎన్నో ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటి వైపు పెద్దగా ఆశక్తి కనపరచకుండా తన దృష్టి అంతా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల వైపు మల్లిస్తూ దక్షణాదిలో తనకు ఏర్పడిన లేడీ సూపర్ ఇమేజ్ కొనసాగిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: