ఈ సినిమా హై-ఆక్టేన్ థ్రిల్లర్‌గా ఉంటుందని, మమ్ముట్టి కార్ రేసర్‌గా నటిస్తున్నారని సమాచారం. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అతని పాత్ర వివరాలు తెలియాల్సి ఉంది. సునీల్ తెలుగు సినిమాలో తన కామిక్ టైమింగ్ వల్ల పాపులర్ అయ్యాడు ఆ తర్వాత విలనిజం కూడా చూపించాడు. మరి సినిమాలో అతను ఎలాంటి షేడ్స్ ఉన్న పాత్ర చేస్తాడో తెలియాల్సి ఉంది. మమ్ముట్టితో స్క్రీన్ స్పేస్ సునీల్ పంచుకోవడం పట్ల అభిమానులుని ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.'టర్బో' అనేది జయసూర్య ప్రధాన పాత్రలో మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో మొదట ప్లాన్ చేసిన 'టర్బో పీటర్' రీ-వాంప్డ్ వెర్షన్ అని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల ఆపివేయబడింది. తరువాత మమ్ముట్టి, వైశాఖ్‌లతో దీనిని పునఃప్రారంభించారు. మేకర్స్ ఈ పుకార్లను కన్ఫామ్ చేయలేదు లేదా ఖండించలేదు. 'టర్బో' 2024లో విడుదల కానుంది. తమిళం, కన్నడ భాషలలో కూడా రిలీజ్ కానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి