
ఇక ఈరోజు కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే కలెక్షన్ల వర్షం కురిపించిన పంజా వైష్ణవ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా ఒకటి… ఉప్పెన తరువాత ఈయన చేసిన కొండ పొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక దాంతో ఎలాగైనా ఈసారి హిట్టు కొట్టాలి అనే ఉద్దేశ్యం తోనే శ్రీకాంత్ రెడ్డి అనే ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆయన డైరెక్షన్ లో ఆది కేశవ అనే మాస్ యాక్షన్ సినిమాని చేశాడు ఇక ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది..? రెండు సినిమాల ఫ్లాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నాడా..? లేదా అనేది మనం ఒకసారి మన బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం.ముందుగా ఈ కథ విషయానికి వస్తే వైష్ణవి తేజ్ ఒక పని పాట లేకుండా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండే ఒక కుర్రాడు. అతనికి శ్రీలీలా పరిచయమవుతుంది. ఇక అప్పటినుంచి ఆమెతోపాటు జాలిగా తిరగడం ఆమెని లవ్ చేస్తున్నానని చెప్పడం అలా ఆమె వెంట తిరుగుతూ ఉంటాడు. ఇక ఇలా సాగుతున్న సినిమాలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక పెద్ద బిజినెస్ మాన్ కావడం విల్లా పెళ్లికి నో చెప్పడం జరుగుతుంది.ఇక ఈ క్రమంలోనే మైనింగ్ చేసే ఒక వ్యక్తి ఒక ఊరికి సంబంధించిన భూములు మొత్తాన్ని తవ్వుతూ ఉంటాడు ఇలాంటి క్రమంలో ఆ ఊర్లో సెంటర్లో ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చి దేవాలయాన్ని కూడా తవ్వాలని చెబుతాడు దానికి ఊరు జనం ఒప్పుకోరు అయిన కూడా ఆ దేవాలయాన్ని తవ్వలని చూస్తాడు అప్పుడు దానికి అడ్డుగా వైష్ణవ్ తేజ్ నిలబడుతాడు ఇక అక్కడి నుంచి కథ ఇంకో మలుపు తిరుగుతుంది… ఇక మరి ఆ వ్యక్తి అనుకున్నట్టుగానే దేవాలయాన్ని తవ్వాడా..? లేదంటే హీరో ఆ దేవాలయాన్ని అతను తవ్వకుండా ఆపగలిగాడా..? అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా లో దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం చాలా రొటీన్ గా అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య రాసుకున్న సీన్లు కూడా కొంచెం రొటీన్ గానే సాగుతూ ఉంటాయి. అయిన కూడా ప్రేక్షకుడిని బోర్ కొట్టించుకుండా దర్శకుడు సినిమాని కొంత వరకు ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఈ సినిమా చివరి వరకు ఉత్కంఠ గానే సాగుతుంది.అయిన కూడా దర్శకుడు కొన్ని సీన్లలో మాత్రం ప్రాపర్ ఎమోషన్ ని క్యారీ చేయడంలో కొంతవరకు తడపడ్డాడు. అలా కాకుండా ఆ ఎమోషన్ ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంటిన్యూ చేసినట్లయితే ఈ సినిమా రేంజ్ ఇంకో లెవెల్ లో ఉండేది. ఇక ఈ సినిమా మాత్రం దర్శకుడు చేసిన ఒక మంచి అటెంప్ట్ అనేది అతని మేకింగ్ లో కనిపిస్తుంది… ఇక కొన్ని సీన్లలో యాక్షన్ ఎపిసోడ్స్ మరి బీభత్సంగా ఉండడంతో యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి అవి చాలా బాగా నచ్చుతాయి.ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే వైష్ణవి తేజ్ తన పాత్ర లో మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. శ్రీలీలా కూడా ఒక అద్భుతమైన డీసెంట్ పాత్ర లో తనదైన నటన ను కనబరుస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఇక వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. దర్శకుడు శ్రీకాంత్ వీరిద్దరి మధ్య తీసిన కొన్ని సీన్లని ఎలివేట్ చేస్తూ ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక అపర్ణ దాస్ కూడా తన పాత్ర మేరకు చాలా బాగా చేసింది. ఇక విలన్ గా చేసిన జోజు జార్జ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన పర్ఫామెన్స్ ని కనబరిచాడు. ఇక మిగతా ఆర్టిస్టుల విషయానికి వస్తే రాధిక లాంటి సీనియర్ నటి కూడా ఈ సినిమాలో ఒక డీసెంట్ రోల్ పోషించి తన పాత్రకి న్యాయం చేసింది… ఇక సుదర్శన్ కామెడీ కూడా చాలా బాగా పేలింది. మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా ఓకే అన్నట్టు గా నటించారు…
ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డు విన్నర్ అయిన జి వి ప్రకాష్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ ఓకే అనిపించేలా ఉన్నప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాత్రం అదరగొట్టాడనే చెప్పాలి. కొన్ని మాస్ ఎలివేషన్స్ సీన్స్ ఎలివేట్ చేయడంలో 100% జీవి ప్రకాష్ కుమార్ సక్సెస్ అయ్యాడు. అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా హైలైట్ అయ్యాయి….ఇక సినిమాటోగ్రాఫర్ డుడ్లి చూపించిన విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కంటికి చూడాలి అనిపించేలా ఒక ఫ్లోలో సినిమా సాగిపోవాడానికి ఆయన అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా సినిమాకి చాలా వరకు హెల్ప్ చేసింది… ఇక ఎడిటర్ నవీన్ నూలి సినిమాకి ఒక న్యూ టైప్ ఆఫ్ ఎడిటింగ్ విధానాన్ని వాడుతూనే షార్ప్ ఎడ్జ్ లో సీన్ ని కట్ చేస్తూ ప్రతి సీను బోర్ లేకుండా తన వంతు ప్రయత్నం చేశాడు… ఇక ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా ఈ సినిమా మీద ఎక్కడ తగ్గకుండా కొత్త డైరెక్టర్ అయినా కూడా అతనిని నమ్మి దానిపైన హెవీగా ఇన్వెస్ట్ చేశాడు ఇక ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి.