ఆర్ఎక్స్ 100 మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అజయ్ భూపతి తాజాగా మంగళవారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.  ఈ మూవీ లో పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయ్యి ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ పది రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు 10 రోజుల్లో నైజాం ఏరియాలో 3.71 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.33 కోట్లు , యు ఏ లో 1.05 కోట్లు , ఈస్ట్ లో 64 లక్షలు,  వేస్ట్ లో 44 లక్షలు , గుంటూరు లో 60 లక్షలు , కృష్ణ లో 42 లక్షలు , నెల్లూరు లో 28 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమా 10 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.47 కోట్ల షేర్ ... 15.50  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ కి 10 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.27 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి మొదటి 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 9.74 కోట్ల షేర్ ... 18.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు 12 కోట్ల మేర ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 13 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ లెక్కన బట్టి చూస్తే ఈ సినిమా మరో 3.26 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: