టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగర్జున ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన ఆఖరుగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ది ఘోస్ట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున "నా సామి రంగ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ ని కచ్చితంగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన 80% షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఆ మిగిలి ఉన్న 20 శాతం షూటింగ్ ను డిసెంబర్ ఎండింగ్ వరకు పూర్తి చేసి ఆ వెంటనే ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేసి ఈ మూవీ ని కచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేసే విధంగా ఈ మూవీ యూనిట్ పక్కా ప్లానింగ్ ను చేసుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: