అర్జున్ రెడ్డి మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న 'యానిమల్' మూవీ సుమారు 3 గంటల 21 నిమిషాల రన్ టైం తోమూవీ థియేటర్స్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా స్వయంగా రివీల్ చేయడంతో చాలా మంది సినిమాపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంత నిడివిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి థియేటర్స్ లో సినిమాని ఎంజాయ్ చేయగలరా అనే సందేహాలు  వ్యక్తం చేశారు. తాజాగా ఈ సందేహాలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు.

ఈ సందర్భంగా తన గత చిత్రం అర్జున్ రెడ్డి సినిమాని ప్రస్తావించాడు. "సినిమాకి భారీ రన్ టైం అనేది ఇబ్బంది కాదు. అర్జున్ రెడ్డి 3 గంటల 6 నిమిషాలు ఉంటుంది. అది ఒక అబ్బాయి అమ్మాయి కథ మాత్రమే. కానీ యానిమల్ లో ఒక కుటుంబం, ప్రత్యర్థులు అంటూ చాలా లేయర్స్ ఉన్నాయి. అర్జున్ రెడ్డి కంటే జస్ట్ 15 నిమిషాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరో పది నిమిషాలు హాయిగా ఏసీలో కూర్చుని సినిమాను ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది" అంటూ యానిమల్ రన్ టైం పై తన కాన్ఫిడెన్స్ ను వ్యక్తపరిచాడు సందీప్ వంగా. 

3 గంటల 21 నిమిషాల రన్ టైం తో ఈ మధ్యకాలంలో మరే సినిమా రాలేదు. కంటెంట్ పై నమ్మకంతోనే మేకర్స్ నిడివిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా యానిమల్ రన్ టైం విషయంలో సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ ని కొందరు సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటూ చెబుతున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ రణబీర్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. బాబీ డియోల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: