టాలీవుడ్ యువ నటి మనులలో ఒకరు అయినటువంటి పాయల్ రాజ్ తాజాగా మంగళవారం సినిమాలో ప్రధాన పాత్రలో నటించే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 ... మహా సముద్రం సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుందు. ఈ 12 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు 12 రోజుల్లో నైజాం ఏరియాలో 3.93 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.41 కోట్లు , యు ఏ లో 1.11 కోట్లు , ఈస్ట్ లో 67 లక్షలు,  వేస్ట్ లో 46 లక్షలు , గుంటూరు లో 64 లక్షలు , కృష్ణ లో 46 లక్షలు , నెల్లూరు లో 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమా 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.98 కోట్ల షేర్ ... 16.55  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ కి 12 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.36 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి మొదటి 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10.34 కోట్ల షేర్ ... 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు 12 కోట్ల మేర ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 13 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ లెక్కన బట్టి చూస్తే ఈ సినిమా మరో 2.66 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: