యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారడు. దూత నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది.సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ లో ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన దూత ప్రమోషనల్ కంటెంట్ చాలా క్యూరియాసిటీని పెంచింది. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన చై.. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ.. సిరీస్ పై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.

ఇక ఒక ఇంటర్వ్యూలో చై.. సామ్ నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి కూడా సామ్- చై విడిపోవడానికి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కారణమని ఎన్నో పుకార్లు వచ్చాయి. పెళ్లి తరువాత అంత బోల్డ్ క్యారెక్టర్ ను సామ్ చేయడం వలనే ఇంట్లో కొన్ని విబేధాలు తలెత్తాయని, ఆ విబేధాలు పెరిగి.. చివరికి వారు విడాకులు తీసుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఇక విడాకుల తరువాత సామ్, చై గురించి మాట్లాడడానికి ఎప్పుడు ఇష్టపడలేదు కానీ, చై మాత్రం.. సామ్ గురించి ఎన్నో ఇంటర్వ్యూలలో పాజిటివ్ గానే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక తాజాగా ” ఇప్పటివరకు మీ మనసును కదిలించిన ఇండియన్ వెబ్ సిరీస్ ఏది.. ? అన్న ప్రశ్నకు చై తడుముకోకుండా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అని చెప్పుకొచ్చాడు. అయితే పర్టిక్యులర్ గా ఫ్యామిలీ మ్యాన్ మొదటి భాగమా.. ? సామ్ నటించిన రెండో భాగమా.. ? అనేది చెప్పలేదు కానీ, అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సిరీస్ తో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: