ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న దసరా అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన నాని ఇక ఇప్పుడు హాయ్ నాన్న అనే ఒక ఫ్యామిలీ ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యం తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. తండ్రీ కూతుర్ల మధ్య ప్రేమ అనుబంధం నేపథంలో ఈ మూవీ ఉండబోతుంది అన్నది ఇప్పటికే టీజర్ ట్రైలర్తో అందరికీ అర్థమైంది.


 ఇక  ట్రైలర్ కు అటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతూ ఉండగా.. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. కాగా ఈ మూవీలో నాని సరసన మృనాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాని ఈ మూవీకి సంబంధించి చేస్తున్న కామెంట్స్ అన్ని కూడా ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెంచేసాయ్. . ఇకపోతే హాయ్ నాన్న సినిమా గురించి డైరెక్టర్ శౌర్యువ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాయ్ నాన్న సినిమాకు తండ్రీ కూతురు మధ్య అనుబంధమే ప్రధాన బలం అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అయితే ప్రేక్షకులకు గుర్తుంటుందని ప్రేమ కథను తీశాను అంటూ తెలిపాడు. ఇక ట్రైలర్ ద్వారానే సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్ పాత్రలు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా 97 రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తి చేసాము అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శౌర్యువ్. అయితే సర్ప్రైజ్ పాత్రలు ఉంటాయనే విషయం చెప్పి ఈ మూవీపై అంచనాలను పెంచేసాడు డైరెక్టర్. ఇక ఈ మూవీపై భారీ రేంజ్ లో అంచనాలు ఉండగా.. ఇక నాని ఈ సినిమాతో ఎలాంటి హిట్టు కొడతాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: