
అందుకే అభిమానులు మాత్రం ఈసారి మళ్లీ రిపీట్ కాంబినేషన్ అయితే బాగుంటుందని నందమూరి అభిమానులు కూడా తెలియజేస్తున్నారు.దీంతో బోయపాటి బాలయ్య కూడా ఇదే పనిలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో నాలుగవ సినిమా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇదే కాంబినేషన్లో కొత్త సినిమా అనగానే అందరూ కూడా అఖండ సీక్వెల్ పైన ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.ఎందుకంటే సీక్వెల్ స్టోరీ సిద్ధంగానే ఉందంటూ ఆ మధ్య ఒక రియాల్టీ షోలో బోయపాటి శ్రీను స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే బాలయ్య మాత్రం ప్రస్తుతం ఫ్రెష్ కథ తో వెళ్దామని తెలియజేస్తున్నట్లు సమాచారం.
ఇలాంటి సమయంలోనే బోయపాటి బాలయ్యకు మూడు కథలు చెప్పారట.ఈ మూడు స్టోరీలు బాలయ్యకు నచ్చడం జరిగిందట. దీంతో బోయపాటి ఏ కథతో ప్రేక్షకుల ముందుకి వస్తారు అనే విషయం తెలియక చాలా డైలమాలో పడ్డారు. అయితే బాలకృష్ణ ఈ మూడు స్టోరీలు నచ్చడంతో ఏ స్టోరీని ఫైనల్ చేస్తారో చూడాలి మరి. ఇటీవలే బాలయ్య భగవంతు కేసరి సినిమాతో థియేటర్లో ప్రేక్షకులను బాగా అలరించారు తన తదుపరి చిత్రాన్ని బాలయ్య డైరెక్టర్ బావితో నిర్మిస్తూ ఉన్నారు. ఈసారి వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న సీనియర్ హీరోగా పేరు పొందారు బాలయ్య. బాలయ్య ఎలక్షన్స్ దృష్టి కాస్త సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్టు సమాచారం.