ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తూ ఒక వెలుగు వెలిగిన వారు ఆ తర్వాత కొన్ని కొన్ని కారణాలు వల్ల సినిమాలకు దూరం అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి.కొందరు అయితే వారీ ఆచూకీ కూడ తెలియని విధంగా ఎక్కడ ఉంటున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియని విధంగా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు.దాంతో అలా ఒకప్పుడు బాగా నటించి స్టార్లుగా వెలిగిన హీరోయిన్స్ గురించి తెలుసుకోవాలని అభిమానులు కుతూహలంగా ఉంటారు. అయితే అందులో కొంతమంది హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి వారు నటించడం లేదా వారి పిల్లలను సినిమా ఇండస్ట్రీ లోకి తీసుకు వస్తూ ఉంటారు.అప్పుడప్పుడు అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలా తాజాగా కూడా ఒక సీనియర్ హీరోయిన్ కూతుర్ల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి.ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు పుట్టారు. హైదరాబాద్‌లో పెరిగారు. మాధవి అసలు పేరు కనక మహాలక్ష్మీ.. చిన్నప్పటినుంచే భరతనాట్యం పట్ల ఆసక్తి ఉండడంతో అందులో శిక్షణ ఇప్పించారు ఆమె తల్లి.

ఇక ఆమె విద్యాబ్యాసం హైదరాబాద్‌ అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది.   చిన్నతనంలోనే ఆమె ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్‌లిచ్చి ఆకట్టుకున్నారు. స్కూల్ డేస్‌లోనే సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు మాధవి. ఎనిమిదో తరగతి చదువుతుండగా ఒక రోజు రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని దాసరి నారాయణరావు చూసి, డాన్స్‌కు ఇప్రెస్ అయ్యారు అందులో భాగంగా దాసరి దర్శకత్వంలో వచ్చిన తూర్పు పడమర చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు.అలా మాధవి 13 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పటికే సినిమా రంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది ఉండటంతో కనక విజయలక్ష్మిని ఆయన మాధవి అని సినీనామకరణం చేశారు. ఇక ఆ తర్వాత ఆమెకు వరుసగా హీరోయిన్ అవకాశాలు వచ్చాయి.ముఖ్యంగా చిరంజీవి సరసన ఆమె చాలా సినిమాల్లో నటించారు. కాగా మాధవి నటించిన చివరి తెలుగు చిత్రం బిగ్ బాస్.

తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లో అవకాశం తగ్గిన తర్వాత బిజినెస్‌మెన్ రాల్ఫ్ శర్మని 1996లో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత మాధవి భర్తతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. ఈజంటకు ముగ్గురు పిల్లలు కూడ ఉన్నారు. ఈమె భర్త భారత, జర్మన్ సంతతికి చెందినవాడని తెలుస్తోంది.మాధవి భర్త మెడికల్ కంపెనీతో పాటు రెస్టారెంట్స్ బిజినెస్‌లు ఉన్నాయంటా. కాగా వాటి విలువ వేల కోట్లలో ఉంటుందని సమాచారం. ఆమె కూతుర్లలో పెద్ద కూతురు పేరు టిఫనీ, రెండో కూతురు పేరు ప్రిసిల్లా, ఇక మూడో కూతురు పేరు ఎవలిన్. ఈ ముగ్గురు కూడా తల్లి అందం పుచ్చుకుని కొంత మంది హీరోయిన్స్‌ కంటే అందంగా ఉన్నారని అంటున్నారు నెటిజన్స్.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానులు మాధవి కూతుళ్లు హీరోయిన్ల కంటే ఇంకా అందంగా ఉన్నారు. వారి అందం ముందు స్టార్ హీరోయిన్ లు సైతం పనికిరారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: