నందమూరి కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసారా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కేథరిన్ , సంయుక్తా మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ క్రేజ్ కూడా తెలుగు లో బాగా పెరిగిపోయింది. ఇలా బింబిసారా మూవీ సక్సెస్ జోష్ లో ఈ నటుడు అమిగోస్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఆపజాయాన్ని ఎదుర్కొంది. అలా అమిగోస్ సినిమాతో ప్రేక్షకులను తీవ్రంగా నిరుత్సాహ పరిచి భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా డెవిల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపోతే ఈ సినిమాకు కూడా భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

మంచి అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ఈ మూవీ మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ కి పరవాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లు దక్కుతున్నప్పటికీ భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ కి పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ దాదాపుగా మరో 10 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుంటుంది. దాదాపుగా ఇది అసాధ్యం అని చెప్పవచ్చు. కనుక ఈ మూవీ తో కూడా కళ్యాణ్ రామ్ కి భారీ డిజాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: