టాలీవుడ్, కోలీవుడ్ , బాలివుడ్ లో విలక్షణమైన నటిగా నేషనల్ అవార్డు విన్నర్ గా పేరు సంపాదించింది హీరోయిన్ ప్రియమణి.. హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తోంది. అలాగే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ భారీ క్రేజ్ అందుకుంది. ఈమె నటించిన భామ కలాపం సిరీస్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇటీవల తెరకెక్కించిన్నా భామ కలాపం-2 ట్రైలర్ ను విజయవాడలో చిత్ర బృందం విడుదల చేస్తూ ఒక కమ్యూనిటీలో ఉండే మహిళలందరూ కూడా ఈ ట్రైలర్ ని ఉత్సాహంగా లాంచ్ చేశారు.


ఈ ట్రైలర్ ఈవెంట్లో ప్రియమణి ,సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.. ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో అనుపమ( ప్రియమణి) తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వంటలకు సంబంధించి కార్యక్రమాన్ని మొదలుపెట్టే మహిళగా చూపించారు. ఆమె ఊహించని పరిస్థితులలో ఒక సమస్యలో చిక్కుకుంటుంది.మరొకవైపు నార్కోటిక్ డిపార్ట్మెంట్ డ్రక్స్ పట్టుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. వాటి అరికట్టడానికి ఏం చేసింది..ఆ వైపు నుంచి అనుపమ ఎలాంటి సమస్యలను చిక్కుకుంది అనే కదాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.


కీలకమైన పాత్రలో సీరత్ కపూర్ కూడా నటించారు.. ఫిబ్రవరి 16న ఆహాలో డైరెక్ట్ గా స్త్రిమ్మింగ్ కాబోతోంది. ఇప్పటికే టీజర్ విడుదలై మంచి హైప్ అందుకుంది. బ్రహ్మాజీ కూడా తన కామెడీ టైమింగ్ తో బాగానే నవ్వించాలా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అభిమన్య తడిమేటి దర్శకత్వం వహించారు. గతంలో విడుదలైన భామ కలాపం వెబ్ సిరీస్ కి సీక్వెల్ గానే భామ కలాపం-2 కొనసాగింపు అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఏ మేరకు ఈ వెబ్ సిరీస్ తో అటు ప్రియమణి కెరియర్ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: