మహేష్ బాబు గారాల పట్టి సితార సోషల్ మీడియాను దున్నేస్తుంది. అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ మైంటైన్ చేస్తుంది. ఇప్పుడు సితారకు పోటీగా రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని రంగంలోకి దిగింది.స్టార్ కిడ్స్ లో సితార ఘట్టమనేని చాలా ప్రత్యేకం. ఐదారేళ్ళ ప్రాయం నుండే ఆమె సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ప్రస్తుతం సితార వయసు 11 ఏళ్ళు. ఇంస్టాగ్రామ్ లో సితారకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు.కేవలం మహేష్ బాబు కూతురిగా కాకుండా తనకు ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది. సితార ఓ జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆమె నటించిన యాడ్ న్యూ యార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో ప్రదర్శించారు. ఈ యాడ్ కి సితార కోటి రూపాయలు ఛార్జ్ చేసినట్లు సమాచారం.సితార తరచుగా డాన్స్ వీడియోలు షేర్ చేస్తుంది. తండ్రి మహేష్ బాబు చిత్రాల్లోని సాంగ్స్ కి తనదైన స్టెప్స్ తో అలరిస్తుంది. సితార డాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కాగా ఇప్పుడు సితారకు పోటీగా మహేష్ అన్న కుమార్తె భారతి ఘట్టమనేని రంగంలోకి దిగింది.సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు కుమారులు కాగా పెద్దబ్బాయి రమేష్ బాబు అనారోగ్యంతో మరణించాడు. రమేష్ బాబుకు ఒక కొడుకు, కూతురు సంతానం. కూతురు పేరు భారతి ఘట్టమనేని. తాజాగా భారతి గుంటూరు కారం చిత్రంలోని సాంగ్ కి స్టెప్స్ వేసింది.ప్రొఫెషనల్ డాన్సర్స్ కి ఏమాత్రం తగ్గని రేంజ్ లో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కి భారతి డాన్స్ చేసింది. సదరు వీడియో చూసిన చెల్లి సితారకు అక్క భారతి నుండి గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం అంటున్నారు. ఘట్టమనేని వారసులు సితార-భారతి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.కాగా వీరిద్దరికీ పూర్తి విరుద్ధం గౌతమ్. మహేష్ బాబు నటవారసుడైన గౌతమ్ కి కనీసం సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. గౌతమ్ చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు. ఆ మధ్య ఓ ఈవెంట్ లో పాల్గొన్న నమ్రతను గౌతమ్ సినీ ఎంట్రీ గురించి అడగ్గా... దానికి ఇంకా సమయం ఉందని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: