ఆర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా ఓ సర్వే చేసింది. తెలుగు బుల్లితెర నటుల్లో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉందని... సర్వే జరపగా.. ఎక్కువ మంది వారికే ఓట్లు వేశారు.ముఖ్యంగా నిత్యం నవ్వించే సుమను కూడా వెనక్కి నెట్టేశారు. ముఖ్యంగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అంతా ఇష్టపడే ఆ ముగ్గురు నటులు.. సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన తెలుగు టెలివిజన్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ జాబితాలో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.అందరూ మెచ్చిన బుల్లితెర నటుల్లో మొదటి స్థానంలో యాంకర్ ప్రదీప్ ఉన్నాడు. యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈయన అనే షోలకు హోస్ట్ గా చేశాడు. అలాగే పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడే యాంకర్ గా దూసుకెళ్తున్నాడు. అద్భుతమైన కామెడీ, స్పాంటెనియస్ తో అందరినీ అలరిస్తున్న ఈయన టాప్ లోకి నిలవడంతో అంతా తెగ ఖుషీ అవుతున్నారు.ఇక టాప్ 2లో సుడిగాలి సుధీర్ నిలిచాడు. ఈయన కూడా జబర్దస్త్ షోలో టీమ్ మెంబర్ గా వచ్చి టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత యాంకర్ గా మారి సందడి చేశారు. ఓవైపు ఇవన్నీ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో హీరోగా కూడా చేస్తూ కెరియర్ లో దూసుకెళ్తున్నాడు. ఇలా బుల్లితెరపై అటు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూ ట్రెండింగ్ లోనే ఉంటున్నాడు. ఇక టాప్ 3లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది నిలిచాడు.ఆర్మాక్స్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో.. గతంలో చాలా సార్లు టాప్ 1 పొజిషన్ ను దక్కించుకున్న హైపర్ ఆది ఈసారి మూడో స్థానానికి పడిపోయాడు. జబర్దస్త్ షోలో ఓ టీమ్ మెబర్ గా కెరియర్ ప్రారంభించిన హైపర్ ఆది.. ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారిపోయాడు. ఆ తర్వాత నుంచి ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు ఈవెంట్స్, చివరకు సినిమాల్లో కూడా కనిపిస్తూ తెగ అలరిస్తున్నాడు. అనేక షోలలో యాంకర్ గా కూడా కనిపిస్తూ రచ్చ చేస్తున్నాడు.
ఇక టాప్ 4లో యాంకర్ సుమ నిలిచింది. ప్రస్తుతం టీవీ షోలు ఎక్కువగా చేయని ఈమె.. ఒక్క క్యాష్ ప్రోగ్రాం మాత్రమే చేస్తోంది. దానికే ఈ మధ్య సుమ అడ్డ అనే పేరు పెట్టారు. అయితే ఓవైపు సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, పలు ఈవెంట్లు చేస్తున్న ఈమె.. ఎక్కువగా షోలు తగ్గించేసుకుంది. అలాగే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఒకే ఒక్క షోతో టాప్ 4లో నిలిచిన సుమ ఈసారి టాప్ 5 లిస్టులో ఒకే ఒక మహిళ కావడం గమనార్హం.ఇక టాప్ 5లో అంటే చివరి స్థానంలో చమ్మక్ చంద్ర నిలిచాడు. ఈయన కూడా జబర్దస్త్ షోలో కమెడియన్ గా, టీం మెంబర్ గా చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అద్భుతమైన స్కిట్లు చేస్తూ అలరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈయన చేసే అద్బుతమైన కామెడీకి ప్రతీకగానే... ఈ లిస్టులో చమ్మక్ చంద్రకు స్థానం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: