అనసూయ అరి సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో విడుదలకు ముందే అభిషేక్ బచ్చన్ అరి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్. అయితే త్వరలోనే అరి సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.అరి సినిమాలో వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్‌తోపాటు వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు నటిస్తున్నారు.ఇది వరకు రిలీజైన అరి టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. కోరికలు తీర్చబడును అంటూ లైబ్రరీలో ఉన్న వ్యక్తి దగ్గరికీ ఒక్కొక్కరుగా వెళ్లి తమ కోరికలను చెబుతారు. వారిలో అనసూయ తన అందం ఎప్పటికీ అలాగే ఉండేందుకు ఏం చేయాలో అడుగుతుంది. అలాగే ఒక్కొక్కరు చెప్పే కోరికలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి