
కార్తికేయ-2 ఏకంగా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. నిఖిల్ కెరియర్ లోనే భారీ కలెక్షన్స్ సాధించిన సినిమానే కాకుండా పాన్ ఇండియా హిట్టుగా కూడా నిలిచింది. ఇప్పుడు కార్తికేయ-3 కూడా ఉంటుందని గతంలో ప్రకటించారు. అయితే ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు.. తాజాగా హీరో నిఖిల్ మాత్రం అధికారికంగా తన సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక ట్విట్ చేశారు.. డాక్టర్ కార్తికేయ కొత్త అడ్వెంచర్ ను వెతుకుతున్నారని త్వరలోనే కార్తికేయ-3 అని ట్వీట్ చేయడం జరిగింది. దీంతో ఈ ట్విట్ కూడా వైరల్ గా మారుతున్నది.
చందు మండేటి ప్రస్తుతం నాగచైతన్య తో తండేల్ అనే సినిమాని చేస్తున్నారు.. ఈ చిత్రం పూర్తి అయ్యాకనే కార్తికేయ-3 సినిమా మొదలు పెట్టబోతున్నారని అధికారికంగా పోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఇంకెంత గ్రాండ్గా ఈ సినిమాని ప్లాన్ చేస్తారో అంటూ అభిమానుల సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఇటీవలే నిఖిల్ స్వయంభు, ది ఇండియా హౌస్ లాంటి భారీ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు.. మరి కార్తికేయ-3 సినిమా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ నిఖిల్ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. ఇటీవలే నిఖిల్ కు కుమారుడు కూడా జన్మించారు.