మరికొన్ని రోజులలో రాబోతున్న ‘ఉగాది’ పండుగను టార్గెట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ ఏప్రియల్ 5న విడుదల కాబోతోంది. ‘గీత గోవిందం’ తరువాత విజయ్ దేవరకొండ కు ఆ రేంజ్ హిట్ లేకపోవడంతో తిరిగి ఆదర్శకుడు పరుశు రామ్ తో విజయ్ చేస్తున్న మ్యాజిక్ వర్కవుట్ అవుతుందని చాల గట్టి నమ్మకంతో ఉన్నాడు.ఈ నమ్మకానికి అనుగుణంగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ ను చాల వెరైటీగా నగరంలో పేరు గాంచిన కొన్ని గేటెడ్ కమ్యూనిటీల వద్దకు వెళ్ళి అక్కడ ఉండే ఫ్యామిలీస్ పిల్లలు యూత్ తో హోలీ పండుగను సెలిబ్రెట్ చేయడంతో ఈ మూవీ మ్యానియా నెమ్మదీనెమ్మడిగా పెరుగుతోంది. దీనికితోడు ఈ ఈవెంట్స్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో చాల మంచి క్రేజ్ ఉన్న మృణాల్ ఠాగూర్ కూడ కలవడంతో అందరి దృష్టి విజయ్ మృణాల్ జంట పై పడినట్లు వార్తలు వస్తున్నాయి.విజయ్ దేవరకొండ నటించిన ‘హాయ్ నాన్న’ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలక్షన్స్ విషయంలో ఆమూవీ విజయ్ కోరుకున్న రికార్డులను క్రియేట్ చేయలేకపోయింది. దీనితో విజయ్ ఆశలు అన్నీ ఈమూవీ పై ఉన్నాయి.  ఈ నెలాఖరుతో పరీక్షల సీజన్ కూడ ఇంచుమించు పూర్తి అవుతూ ఉండటంతో ఈమూవీకి కలక్షన్స్ విషయంలో ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చనీ అంచనాలు వస్తున్నాయి. సంక్రాంతి తరువాత సినిమాల హడావిడి పూర్తిగా తగ్గిపోయింది. కొన్ని చిన్న సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలక్షన్స్ విషయంలో ఆసినిమాలు ఎటువంటి హడావిడి చేయలేకపోయాయి.ఈవారాంతానికి టిల్లు జాతకం తెలిపోతుంది. దీనితో విజయ్ ఫ్యామిలీ స్టార్ కు ఇక ఎటువంటి అడ్డంకులు ఉండవని అంచనాలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా ఎంజాయ్ చేసే సినిమాలు ఏమీ రాలేదు. దీనితో ఆలోటును ఈమూవీ తీరుస్తుంది అంటున్నారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఆల్బమ్ లో మూడు పాటలు ఇప్పటికే అందరికీ బాగా నచ్చాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: