సంక్రాంతి తరువాత బాక్స్ ఆఫీస్ వెలవెల పోతోంది. మధ్యమధ్యలో కొన్ని చిన్న సినిమాల హడావిడి కనిపించినప్పటికీ ఆహడావిడి ఆసినిమాలకు రెండవ వారం ఎంటర్ అవ్వగానే చల్లారి పోతోంది. లేటెస్ట్ గా విడుదలైన ‘టిల్లు స్క్వేర్’ కలక్షన్స్ హడావిడి రెండవ వారం ఎంటర్ అయ్యేసరికీ చల్లారి పోవడంతో సినిమాలకు ఇప్పట్లో ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదా అన్న సందేహాలు చాలమందిలో ఉన్నాయి.



ఉగాది ముందు విడుదలైన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీని చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడ పెద్దగా ఆశక్తి చూపెట్టక పోవడంతో ఈమూవీ ఫ్లాప్ గా మారింది. ఈమూవీతో పోటీగా విడుదలైన మళయాళ బ్లాక్ బష్టర్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ కు టాక్ బాగానే వచ్చినప్పటికీ ఆమూవీ కలక్షన్స్ కూడ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.



ఈపరిస్థితుల మధ్య అంజలి లీడ్ రోల్ లో నటించిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ 50 కోట్లు కలక్షన్స్ వస్తాయని ఈమూవీ నిర్మాత రచయిత కోన వెంకట్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆమూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ తో కనీసపు కలక్షన్స్ కూడ రావడం లేడు అని వార్తలు వస్తున్నాయి. ఈమూవీతో పోటీగా విడుదలైన ‘శ్రీరంగ నీతులు’ ‘లవ్ గురు’ సినిమాలకు కూడ టాక్ ఏమాత్రం బాగాలేదు.



ఇప్పుడు రంజాన్ ను టార్గెట్ చేస్తూ విడుదలైన బాలీవుడ్ మూవీలు ‘మైదాన్’ కు టాక్ బాగున్నా తెలుగు రాష్టాల్లో రెస్పాన్స్ అంతంతమాత్రమే అన్న వార్తలు వస్తున్నాయి. మరొక బాలీవుడ్ మూవీ ‘బడేమియా చోటేమియా’కు డిజాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా వైపు కూడా ప్రేక్షకులు రావడం లేదు అని తెలుస్తోంది. దేనితో ప్రేక్షకులు లేక బాక్స్ ఆఫీస్ వెలవెల పోతోంది. ఒకవైపు ఎన్నికల హడావిడి మరొక వైపు ఐపిల్ టారన్మెంట్ మ్యానియాతో పాటు టాప్ హీరోల సినిమాల విడుదల ఇప్పట్లో లేకపడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వందల కోట్లు  కురిపించే సమ్మర్ సీజన్ ఖాళీ సీట్లతో ధియేటర్లు దర్శనం ఇస్తున్నాయి అనుకోవాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: