మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.భీమ్లా నాయక్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ వెంటనే బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్బస్టర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలతో మాలీవుడ్, టాలీవుడ్లో పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ మలయాళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన మూవీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో సంయుక్తి మీనన్ టాలీవుడ్పై షాకింగ్ కామెంట్స్ చేసింది.తెలుగులో పరిశ్రమకు ఇంకా తాను అలవాటు పడలేదని, ఓ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానంది. టాలీవుడ్లో మేకప్కు అలవాటు పడటం తన కఠిన పరీక్షగా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "మలయాళంలో సినిమాలు చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేకప్ కంటే సహజమైన లుక్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేకప్ చాలా తక్కువగా వాడతారు. మేకప్ వేసిన రియాలిటీ దగ్గరగా ఉంటుంది. కానీ తెలుగులో అలా కాదు. స్క్రీన్ ప్రజెన్స్, మన కట్టుబోట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్క్రీన్పై మరింత అందంగా కనిపించేందుకు మేకప్ ఎక్కువ వాడతారు. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది వినడానికి సిల్లిగా ఉన్న.. దానివల్ల నేను తెలుగు ఇండస్ట్రీకి అలవాటు పడలేకపోతున్నా.

ఎందుకంటే నాకు అతీ మేకప్ కంటే కూడా న్యాచురల్గా కనిపించడానికి ఇష్టపడతాను. దానివల్ల అది తెలుగులో మేకప్ అనేది సవాలుతో కూడుకున్న అంశమైంది. ఎందుకంటే హెవీ మేకప్ వల్ల నా ముఖంపై ఏదో ఉందనే ఫీలింగ్ వస్తుంటుంది. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ, ఏం చేయలేం. అయితే చీరడ్రాపింగ్కి విషయంలో మాత్రం నేను అసలు కాంప్రమైజ్ కాను. నా కాస్ట్యూమ్ సిబ్బందితోనే చీరకట్టించుకుంటాను. ఎందుకంటే చీరకట్టే విధానంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫ్లీట్స్ సరిగ్గా కనిపించకుండ లుక్కు రాదు. అసహ్యంగా కనిపిస్తుంది. అందుకే శారీ డ్రాపింగ్కి మాత్రం నా కాస్ట్యూమ్ డిజైనర్స్ మాత్రమే అనుమతిస్తాను" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి.సాధారణంగా ఇతర భాష, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు తెలుగులో ఎక్కువ ఇబ్బంది పడేది భాష వల్లే. కానీ విచిత్రంగా సంయుక్త మీనన్ మాత్రం ఇక్కడ మేకప్ వల్ల ఇబ్బంది పడుతున్నానని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఆమె కామెంట్స్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక సంయుక్త సినిమాల విషయానికి వస్తే. ప్రస్తుతం ఆమె తెలుగులో ఓ పాన్ ఇండియా మూవీతో బిజీగా ఉంది. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న 'స్వయంభు' మూవీలో ఆమె హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో నభా నటేష కూడా ఓ కీ రోల్ పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మరోవైపు శర్వానంద్, డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబినేషన్లో రాబోయే ఓ కామెడీ డ్రామాలో సంయుక్త హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది. ఇక మలయాళంలో మోహన్లాన్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న రామ్ అనే సినిమాలోనూ నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: