మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందపోతున్న మూవీకి సంబంధించిన గాసిప్పులు వార్తలు ఈమూవీ పూజ కార్యక్రమం కూడ ఇంకా జరక్కుండానే సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తున్నాయి. అయితే ఈ వార్తల పై రాజమౌళి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ గాసిప్పులలో ఎంతోకొంత నిజం ఉందా అన్న సందేహాలు చాలమందిలో ఉన్నాయి.ఇప్పటికే ఈ మూవీలో మహేష్ పక్కన హీరోయిన్ గా ఒక ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ నటిస్తోంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈమూవీలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలకు కొనసాగింపుగా ‘సలార్’ మూవీలో వరద రాజమన్నార్ పాత్రను చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మళయాళ నటుడు పృధ్వీ రాజ్ సుకుమారన్ ఈమూవీలో కీలకమైన నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు అంటూ మరొక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.‘సలార్’ ఘన విజయంలో ప్రభాస్ తో సరిసమానంగా పృధ్వీ రాజ్ సుకుమారన్ కు మంచి పేరు రావడంతో జక్కన్న దృష్టి ఈ నటుడి పై పడింది అంటున్నారు. దీనికితోడు ఈమధ్య విడుదలైన బాలీవుడ్ మూవీ ‘చోటేమియా బడేమియా’ లో ఇతడు చేసిన పాత్రకు మంచి పేరు బాలీవుడ్ లో రావాదంతో రాజమౌళి దృష్టిలో ఇతడు ఉన్నాడు అన్న అంచనాలు కూడ ఉన్నాయి.ఇది ఇలా ఉండగా ఈమూవీ పూజా కార్యక్రమాలు సూపర్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31న జరుగుతాయని ఆరోజు ఈసినిమాకు సంబంధించిన మొదటి మీడియా సమావేశం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమా కోసం మహేష్ హెయిర్ స్టైల్ లో చేసిన మార్పులు జనంలోకి విపరీతంగా వెళ్ళిపోయింది. ఇక రానున్న రోజులలో మహేష్ లుక్ లో చాల మార్పులు రాజమౌళి చేయబోతున్నాడనీ ఈమూవీ షూటింగ్ ప్రారంభం అయ్యాక పబ్లిక్ ఫంక్షన్స్ దూరంగా ఉండమని రాజమౌళి మహేష్ కు సలహా ఇచ్చాడు అంటూ గాసిప్పులు సందడి చేస్తున్నాయి..   మరింత సమాచారం తెలుసుకోండి: