సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన.. మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మృణాల్ తను విన్న, ట్రై చేసిన కొన్ని విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ల.. గురించి మాట్లాడుతూ.. ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.టీవీ సీరియల్స్ తో తన కెరియర్ ను మొదలుపెట్టిన.. మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో.. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే.. స్టార్ స్టేటస్ అందుకున్న మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత నాని సరసన హాయ్ నాన్న అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో.. మృణాల్ ఠాకూర్ కి బోలెడు ఆఫర్లు వచ్చి పడ్డాయి. ది ఫ్యామిలీ స్టార్.. సినిమాతో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయిన మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం వేరే సినిమాలతో.. బిజీగా ఉంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మృణాల్ తాను ట్రై చేసిన కొన్ని విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ల గురించి, తాను విన్న విచిత్రమైన ఆహారం గురించి.. కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.

ఫుడ్ కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మృణాల్ ఠాకూర్ తాను కొన్ని విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్స్.. ప్రయత్నించిందని చెప్పింది. వేరే వాళ్ళు పిజ్జాతో అప్పం, పైనాపిల్ తో కెచప్ వంటి క్రేజీ ఫుడ్ తిన్నా.. కూడా తనకి పెద్దగా ప్రాబ్లం లేదని.. ఎందుకంటే తాను కూడా ఇలాంటి కొన్ని విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్స్ ట్రై చేసిందని చెప్పింది.. మృణాల్.ఇంతకీ ఆమె తిన్న విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ ఏంటి అని ఇంటర్వ్యూ చేసే ఆమె అడగగా.. మృణాల్ ఠాకూర్ వెంటనే..అన్నంతో ఐస్ క్రీమ్ అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆ కాంబినేషన్ బాగుంది అని కూడా చెప్పింది. "నేను కొంచెం అన్నంతో వెనీలా ఐస్ క్రీమ్ తిన్నాను. అది అంత బ్యాడ్ గా ఏమి.. అనిపించలేదు. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం అది క్రేజీ కాంబినేషన్ అంటారు. నాకు ఇష్టమైన వాటిల్లో నా ఫ్రెండ్స్ క్రేజీ అనే మరొక కాంబినేషన్.. బ్లాక్ కాఫీ తో బనానా. బ్లాక్ కాఫీ కొంచెం చేదుగా ఉంటుంది. కానీ అరటిపండు తీయగా ఉంటుంది. పైగా నాకు అరటిపండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే బ్లాక్ కాఫీ తో అరటిపండు.. ఇష్టపడతాను. ముఖ్యంగా వర్కౌట్ చేసే ముందు తీసుకోవడం.. చాలా బాగుంటుంది అని చెప్పింది మృణాల్ ఠాకూర్.ఇక సినిమాల పరంగా చూస్తే మృణాల్.. ప్రస్తుతం ఒక హిందీ సినిమాతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న.. విశ్వంభర సినిమాలో కూడా మృణాల్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. రాఘవ లారెన్స్.. దర్శకత్వం వహిస్తున్న కాంచన 4 లో కూడా మృణాల్ ఠాకూర్ నటింస్తోంది అని వార్తలు వినిపించాయి. కానీ రాఘవ లారెన్స్ ఆ వార్తలలో నిజం లేదు అని చెప్పిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: